తిరుపతి: కల్కి ఆశ్రమం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచి పెట్టాలని సత్యవేడు ఎమ్మెల్యే, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. కల్కి భగవాన్ అక్రమాస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న కల్కి ఆశ్రమం వ్యవస్థాపకుడు విజయ కుమార్ నాయుడు, పద్మావతిని కస్టడీలోకి తీసుకోవాలన్నారు. కల్కి ఆశ్రమానికి ఉన్న బినామీలు ఎవరో నిగ్గు తేల్చి నిజనిజాలు బయటపెట్టాలన్నారు. హవాలా మార్గం ద్వారా వచ్చిన విదేశీ సొమ్ము లోగుట్టు వెలికితీయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. Read Also: చంద్రబాబును అరెస్టు చేయాలి