వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా పూలే జయంతి వేడుకలు 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పూలే విగ్ర‌హాల‌కు, చిత్ర‌ప‌టాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫూలే చిత్ర‌ప‌టానికి నివాళులర్పించ‌గా, పార్టీ నాయ‌కులు కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా జ‌యంతి వేడుక‌లు నిర్వహించారు.  

అన్న‌మ‌య్య జిల్లా..

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శ్రీకాంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.   అణగారిన వర్గాల ఆశా జ్యోతి, సామాజిక విముక్తి ప్రదాత   మహాత్మా జ్యోతి రావు పూలే అని  శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు.    

వైయ‌స్ఆర్ జిల్లా..
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కడపలో  మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. పాత బస్టాండ్ వద్ద గల జ్యోతిరావు ఫూలే విగ్రహానికి  పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, త‌దిత‌రులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

విశాఖ జిల్లా..
విశాఖ నగర వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.  పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు బాబూరావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఫూలే చిత్రపటానికి పార్టీ నాయ‌కులు పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు.  

అనంత‌పురం జిల్లా..
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, ప్రముఖ సంఘసంస్కర్త  "మహాత్మా జ్యోతిరావు పూలే" గారి 199 వ జయంతిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కేంద్రంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో "జ్యోతిరావు పూలే" జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలసి వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పాల్గొని పూలే  చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చిరస్మరణీయం అని పేర్కొన్నారు. స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.   పేదలు ఉన్నత స్థానికి ఎదగాలంటే విద్యతోనే సాధ్యం అని చెప్పిన వ్యక్తి పూలే గారు అని చెప్పారు. జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకుని దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్సార్ పేద విద్యార్థుల కోసం ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకువస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టారని గుర్తు వేశారు. మరి బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు.

తిరుపతి జిల్లా..
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా  జ్యోతిరావు ఫూలే జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఫూలే చిత్ర పటానికి వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకరరెడ్డి, ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి , వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళుల‌ర్పించారు.

శ్రీసత్యసాయి జిల్లా.. 
మ‌హాత్మా జ్యోతిరావు పూలే జ‌యంతి వేడుక‌లు జిల్లా కేంద్రంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్  పూలే చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం మంత్రి సవిత తీరును మీడియా వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. మంత్రి సవిత‌ హాఫ్ నాలెడ్జి తో మాట్లాడుతోంద‌ని ఉష‌శ్రీ చ‌ర‌ణ్ మండిప‌డ్డారు. వైయ‌స్‌ జగన్ ను విమర్శించే స్తాయా నీది. శవ రాజకీయాలు చేస్తున్నది నీవు కాదా అని ధ్వ‌జ‌మెత్తారు.  జగనన్నను విమర్శించేపుడు నీ స్దాయి గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.
 
ఎన్టీఆర్ జిల్లా 

వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక‌లు జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ,ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ,  వైయ‌స్ఆర్‌సీపీపీఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్ , పార్టీ నాయ‌కులు కార్య‌క్ర‌మంలో పాల్గొని ఫూలే చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు.    

విజయనగరం జిల్లా..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే  జయంతి కార్య‌క్ర‌మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వ‌ర్యంలో ఫూలే చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు ముఖ్య నాయకులు, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
ప్ర‌కాశం జిల్లా..
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. పూలే చిత్రపాటానికి  జిల్లా పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజక పార్టీ ఇంఛార్జి చుండూరి రవి బాబు, నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ త‌దిత‌రులు నివాళుల‌ర్పించారు. 
 

Back to Top