తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున దాష్టీకం

 ఫ్లెక్సీ కట్టాడని వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌పై విచక్షణారహితంగా దాడి

ప్రకాశం: ప్రకాశం జిల్లా తాళ్లూరు ఎస్‌ఐ మ‌ల్లికార్జున రెచ్చిపోయారు. అధికార పార్టీ అండ చూసుకొని ఓ వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌పై బెల్ట్‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు.  కొర్రపాటిపాలెంకు చెందిన విష్ణు.. వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లెక్సీ కట్టాడనే కారణంగా అతడిపై ఎస్‌ఐ మల్లికార్జున కేసు పెట్టారు.  విష్ణుపై కక్షగట్టిన టీడీపీ నేతలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, టీడీపీ నేతల ప్రోద్భలంతో ఎస్‌ఐ.. వారి ఫిర్యాదు తీసుకుని విష్ణును స్టేషన్‌కు తరలించి విచక్షణారహితంగా దాడి చేశారు. తన బెల్టుతో విష్ణును చితకబాది ఆ త‌రువాత‌ వదిలిపెట్టారు. తీవ్రంగా గాయ‌ప‌డిన విష్ణు ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి.. అర్ధరాత్రి అతడిని పరామర్శించారు.

Back to Top