ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయం

తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుప‌తి:  తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిదున్ రెడ్డిపై దాడిని ఆయ‌న‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన హెచ్చ‌రించారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ రేపు ఎవరూ ఉండరు అనేది ఆలోచించుకోవాల‌ని ఎంపీ గురుమూర్తి సూచించారు.

Back to Top