తాడేపల్లి: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ సంతాపం తెలిపారు. వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైయస్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో ఇవాళ వైయస్ జగన్ సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం వైయస్ జగన్ సమావేశం ప్రారంభించారు.