తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబడినందుకు వాళ్లను ఆయన అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం(TDP Kutami Prabhutvam) ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కోృఆప్టెడ్ సభ్యులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో(Local Body Elections By polls) చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణపైనా ఈ సమావేశంలో వైయస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతినిధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.