తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల)కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లను ఆహ్వానించారు. వీరితో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.