మ‌హాత్మా జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి:  మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పూలే చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు.  సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. పూలే జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీలు కే ఆర్ జె భరత్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్, కృష్ణా జిల్లా  జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, త‌దిత‌రులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
 

Back to Top