భ‌గ‌వాన్ మ‌హావీర్‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్‌ జయంతి (మహావీర్‌ జన్మకల్యాణక్‌) సందర్భంగా భగవాన్‌ మహావీర్‌ చిత్రపటానికి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పూల‌మాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ వి సతీష్‌ కుమార్‌ రెడ్డి, జైన్‌ వెల్ఫేర్ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ మనోజ్‌ కొఠారి, జైన్‌ సమాజ్‌ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముతా, జైన్‌ సమాజ్‌ సెక్రటరీ పన్నాలాల్‌ జీ, జైన్‌ సమాజ్‌ కమిటీ మెంబర్‌ విక్రమ్‌ బండారి, జైన్‌ సమాజ్‌ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌లాల్‌ కొఠారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top