తాడేపల్లి: చూపు లేకపోతే లోకమంతా చీకటే. చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుంది. అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు కూడా చోటిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘ వైయస్ఆర్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిల్లలు, వృద్ధులకు వరమే అయింది. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. ఇవాళ మూడో దశ వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా ఫేజ్-3ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.