

















బాలినేని టీడీపీ కోవర్ట్ ..కుదరక జనసేన లో చేరాడు
వైయస్ఆర్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవి బాబు
ఒంగోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గురించి అవాకులు, చవాకులు పేలిస్తే ఊరుకోమని వైయస్ఆర్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవి బాబు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని హెచ్చరించారు. బాలినేని మొదటి నుంచి టీడీపీ కోవర్ట్ అని, ఆయన్ను ఆ పార్టీలో చేర్చుకోకపోవడంతో జనసేనలోకి వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ సభలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై రవిబాబు ఫైర్ అయ్యారు. శనివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్ఆర్‌సీపీ(ysrcp) ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించి బాలినేని అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. వైయస్ జగన్‌ను విమర్శించే స్థాయి బాలినేనికి లేదన్నారు. బాలినేని చరిత్ర ప్రకాశం జిల్లా మొత్తానికి తెలుసు అన్నారు. ఆయనకు వైవీ సుబ్బారెడ్డి ద్వారానే వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం బంధువు అయ్యారని చురకలంటించారు. వైయస్ జగన్ వెంట నడవడానికి నెలల తరబడి ఆలోచించిన చేసిన విషయం జిల్లా ప్రజలకు తెలుసు అన్నారు. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది...అది ఎక్కడ అమ్మావని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఖర్చు తో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్లింది వాస్తవం కాదా అని నిలదీశారు. కాసినోకి వెళ్తా అని నువ్వే చెప్పావు .అక్కడ కూడా మీ నాన్న ఆస్తే పోగొట్టావా..? అని ఎద్దేవా చేశారు. ఒంగోలు లో బ్రాహ్మణ ల భూమి కాజేసిన ఘనుడు బాలినేని అని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మిఎంచుకున్నావంటూ ఆయన విమర్శించారు. బాలినేని.. వైయస్ జగన్ గురించి మాట్లాడే స్థాయేనా నీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ఒంగోలు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రవిబాబు హెచ్చరించారు.