

















మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల పరిశీలన
నెల్లూరు జిల్లా: కూటమి ప్రభుత్వం అరాచక, దోపిడి పాలన కంటే బ్రిటిష్ పాలనే నయమని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వరికుంటపాడు మండలం కనియంపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల అక్రమ నరికివేత ప్రాంతాన్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేరీగా మురళి తదితరులు పరిశీలించారు. అనంతరం చెట్లు నరికిన దొంగలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ అక్రమార్కులపై చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు.