హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్‌ను చేర్చాలి

ఎంపీ త‌నూజారాణి 

ఢిల్లీ:  హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్‌ను కూడా చేర్చాలని లోక్‌సభ వేదికగా వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ ను ఈ ప్రాజెక్టులో చేర్చలేదనివైఎస్సార్‌సీపీఎంపీ తనూజరాణి స్పష్టం చేశారు.  ఈరోజు(సోమవారం) లోక్ సభలో రైల్వే శాఖ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ‘హౌరా చెన్నై మెయిన్ లైన్ లో  వయా వైజాగ్ ద్వారా ప్రతిరోజు 508 ట్రైన్లు వెళ్తుంటాయి. అమరావతికి 363 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ కు హై స్పీడ్ ట్రైన్  కనెక్టివిటీ కల్పించాలి’ అని ఆమె కోరారు. ‘రాయగడ డివిజన్ లోకి అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ ను మార్చవద్దు.  వాల్తేరు డివిజన్లోని అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ ను కొనసాగించాలి.  ఈ మార్పు వల్ల గిరిజనుల సెంటిమెంట్ దెబ్బతింటుంది’ అని ఆమె పేర్కొన్నారు.

బడ్జెట్ లో పేదలకు అన్యాయం జరిగింది..
రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎంపీ గొల్లబాబు రావు మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పోరేషన్లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తగిన నిధులు ఇవ్వడం లేదు. దీని కారణంగా పేదలకు అన్యాయం జరిగింది.  సోషల్ జస్టిస్ మినిస్ట్రీ.. సోషల్ ఇంజస్టిస్ మినిస్ట్రీగా మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో హామీ ఇచ్చారు.. దాన్ని నిలబెట్టుకోలేదు.  ఏపీకి తగిన న్యాయం చేయాలి. 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బాధ్యత ను ఎందుకు ఎత్తుకుంది?, కేంద్రం పోలవరంకు సరైన నిధులు ఇవ్వడం లేదు. పోలవరం ఎత్తును 45 నుంచి 41 మీటర్లకు తగ్గిస్తే ఏపీ ప్రజలు ఊరుకోరు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. రైల్వే జోన్ శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదు’అని గొల్లబాబూ రావు స్పష్టం చేశారు. 

Back to Top