వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

వైవీ సుబ్బారెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత సంతాపం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ పీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ.సుబ్బారెడ్డి తల్లి  పిచ్చమ్మ మృతి పట్ల పార్టీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుడ్ని కోరుకున్నారు. 85ఏళ్ల పిచ్చమ్మ కొద్దిరోజులుగా కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 

Back to Top