గుంటూరు: జిల్లాలోని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ చౌదరి వివాహ రిసెప్షన్ కు మాజీ ముఖ్యమంత్రి,వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తెనాలి ఏఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో వైయస్ జగన్.. నూతన వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు . వైయస్ జగన్ రెడ్డి రాకతో భారీ స్థాయిలో అభిమానం సంద్రం తరలివచ్చింది. భారీ సంఖ్యలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు , అభిమానులు నాయకులు తరలివచ్చారు. తెనాలిలో జగనన్న కారు వెంట పరిగెడుతు జగనన్నకు ఘనస్వాగతం పలికారు అభిమానులు.