‘లోకల్’లో స‌త్తా చాటిన వైయ‌స్ఆర్‌సీపీ  

స్థానిక సంస్థల్లో ఉపఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచిన పార్టీ అభ్యర్థులు

బ‌లం లేకున్నా..బ‌రితెగించిన కూట‌మి నేత‌లు

కిడ్నాప్ లు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలు

గుండె నిబ్బరంతో ఎదుర్కొని నిలబడిన వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు

కడప జిల్లా జెడ్పీ చైర్మన్ గా వైయస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఘన విజయం 

మెజార్టీ ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకున్న వైయస్ఆర్‌సీపీ

తాడేప‌ల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన పదవులు చేజిక్కించేందుకు కూటమి నేతలు చేసిన అన్ని రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్ లు, దౌర్జన్యాలు, దాడులతో దొడ్డిదారిన గెలవాలనకున్న కూటమి నేతల ఆశలను వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు అడియాశ చేశారు. గుండెనిబ్బరంతో నిలబడి పోరాడి విజయం సాధించారు. కడప జిల్లా జెడ్పీ చైర్మన్ గా వైయస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోర్టు ద్వారా ఎన్నికను అడ్డుకోవాలని కూటమి నేతలు చివరి వరకు ప్రయత్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యారు. కూటమి నేతల దౌర్యన్యాల కారణంగా పలు చోట్ల ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

కడప జెడ్పీ పీఠం వైయస్ఆర్‌సీపీ కైవసం 
వైయ‌స్ఆర్ క‌డ‌ప‌ జిల్లా పరిషత్‌ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైయస్ఆర్‌సీపీ గెలిచింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నిక‌ల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో  జెడ్పీ చైర్మన్‌ పదవికి గురువారం ఉప ఎన్నిక జరిగింది. కొందరు జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా.. ఇప్పటికీ 42 మంది జెడ్పీటీసీలు వైయస్ఆర్‌సీపీ వెంటే ఉన్నారు.  చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. అయితే, టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క జెడ్పీటీసీతో  జెడ్పీ చైర్మన్‌ ఎన్నికను నిలుపుదల చేసేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో ఉప ఎన్నిక ఆపడం కుదరదని హైకోర్టు స్పష్టం చేయడంతో కూటమి నేతలు భంగ‌ప‌డ్డారు. చివ‌ర‌కు ఉప ఎన్నికలో జెడ్పీ పీఠాన్ని వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.

మండల పరిషత్ ఉప ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ హవా
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బండి లక్ష్మీదేవి గెలుపొందారు. అనంతపురం జిల్లా కంబదూర్ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి కురుబ లక్ష్మీదేవి ఏకగ్రీవమయ్యారు. కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి రాచపాటి రామాంజినమ్మ గెలుపొందారు. రామాంజినమ్మకు మద్దతుగా 16 మంది ఎంపీటీసీలు నిలిచారు. తిరుపతి రూరల్ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి మూలం చంద్రమోహన్ విజయం సాధించారు. చంద్రమోహన్ కు 33 మంది ఎంపీటీసీలు మద్దతు పలికారు.  ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి  ఆల్ల సుబ్బమ్మ గెలుపొందారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పట్నం ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాజీపేట వైస్ ఎంపీపీ స్థానాన్ని వైయస్సార్ సీపీ అభ్యర్థి ముమ్మడి స్వప్న గెలిపొందారు.  అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా రుత్తల  సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు.  మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ ఆధ్వర్యంలో 10 మంది వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలు  మండల కార్యాలయం చేరుకున్నారు. బలం లేక టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గడంతో సర్వేశ్వరరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. కర్నూలు వెల్దుర్తి ఎంపీపీ పదవి వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా దేశాయి లక్ష్మీదేవి ఎంపీపీగా ఎన్నికయ్యారు.  ప్రకాశం జిల్లా పీవీపాలెం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ సీతారామరాజు ఎన్నికయ్యారు.

 

 టీడీపీ దౌర్జన్యాలతో పలు చోట్ల  బాయ్ కాట్.. వాయిదా 
పల్నాడు జిల్లా నరసరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. పోలీసులు, టీడీపీ నేతల వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ ఉప ఎన్నికను బాయ్ కాట్ చేసింది. దీంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.  వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అరాచకం సృష్టించారు. గోపవరం ఉపసర్పంచ్ ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే వర్గీయులు వైయస్ఆర్‌సీపీ వార్డు మెంబర్లపై రాళ్ల దాడి చేశారు. మహిళా సభ్యులని కూడా చూడకుండా రాళ్ల దాడి చేశారు. దాడిలో పలువురు వైయస్ఆర్‌సీపీ వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి.  వైయ‌స్ఆర్ జిల్లా గోపవరం పంచాయతీ బై ఎలక్షన్ లో  నకిలీ ఐడీ కార్డులతో టీడీపీ బోగస్ వార్డ్ మెంబర్లు లోపలకు ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇద్దరిని పోలీసులు వెనక్కి పంపేశారు. పశ్చిమగోదావరి జిల్లా  అత్తిలి ఎంపీపీ ఉపఎన్నిక నేపథ్యంలో సంఖ్యాబలం లేని టీడీపీ కుట్రలకు తెరతీసింది. మాజీ మంత్రి కారుమూరి నివాసం దగ్గర టీడీపీ గూండాల హల్ చల్ చేశారు.  ఎంపీటీసీ సభ్యులను దిగ్బంధించారు. టీడీపీ గూండాల అరాచకాలను పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఒక్క స్థానం కూడా లేని   టీడీపీ అడ్డదారిలో గెలిచేందుకు యత్నించింది. పోలీస్ భద్రత నడుమ వైయస్సార్ సీపీ ఎంపీటీసీలు తరలిస్తుండగా.. వి.కోట వద్ద వారిని టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్ టిడిపి నాయకులు లాక్కొని హంగామా చేశారు.  కర్ణాటక రాష్ట్రం రాజుపేట రోడ్ వద్ద పోలీస్ ఎస్కార్ట్ తో ఉన్న ఎంపీటీసీ ల వాహనాన్ని టిడిపి శ్రేణులు నిలిపి వేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.  పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ గెలిచేందుకు కుట్రలు చేయడంతో నరసరావుపేట  వైస్ ఎంపీపీ ఎన్నికను వైయస్ఆర్‌సీపీ బహిష్కరించింది. ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.  వైఎస్ఆర్ సీపీ సభ్యులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, టీడీపీ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎన్నికల బహిష్కరిస్తున్నామని చెప్పారు. 16 మంది సభ్యులకు గాను ఐదుగురు మాత్రమే హాజరు కావటంతో కోరం లేదన్న కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. కోరం లేకపోవడం తో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప  ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.  శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బెదిరింపులకు దిగారు. కదిరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త మక్బూల్ ను పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించారు. గాండ్లపెంట ఎమ్పీడీవో కార్యాలయం లో మీడియా ను అధికారుల అనుమతించలేదు. కార్యాలయం తలుపులు మూసి ఎమ్మెల్యే  ప్రలోభాలతో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను లోబరుచుకునే ప్రయత్నం చేశారు.  

 
దొడ్డిదారిలో అచ్చంపేట, రామకుప్పంలో టీడీపీ గెలుపు
పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ స్థానాన్ని దొడ్డిదారిలో టీడీపీ సొంత చేసుకుంది. టీడీపీకి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ, ఆమె భర్తను కూటమి నేతలు బుధవారం కిడ్నాప్‌ చేసి బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. గురువారం ఎన్నిక నిర్వహించగా టీడీపీ అభ్యర్థి స్వర్ణమ్మ బాయికి 9 మంది ఎంపీటీసీలు మద్దతుగా నిలిచారు. రామకుప్పంలో టీడీపీ నేతల అరాచకం సృష్టించారు. ఒక్క ఎంపీటీసీ సభ్యుడు లేకున్నా ఆరుగురు వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను బెదిరించి టీడీపీ గెలిచినట్టు ప్రకటించుకున్నారు.  కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మీ ఏకగ్రీవమయ్యారు.  ఎంపీపీ ఎన్నికను న 8 మంది వైయస్ఆర్సీపీ ఎంటీసీలు బహిష్కరించారు. తూ.గో.జిల్లా బిక్కవోలు ఎంపీపీ పదవిని దొడ్డిదారిలో బీజేపీ సొంతం చేసుకుంది. వైయస్ఆర్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి బీజేపీ నేతలు వారి వైపునకు తిప్పుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవిని కూటమి దక్కించుకుంది. ఎంపీపీ ఎన్నికకు వైయస్ఆర్‌సీపీ దూరంగా ఉంది.  అల్లూరి జిల్లా జి.మాడుగులు ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ప.గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీ ఎన్నికపై టీడీపీ కుట్రలకు తెరతీసింది. 17 మంది సభ్యుల్లో వైయస్ఆర్సీపీకి 13 మంది మద్దతు ఉంది. బలం లేకపోవడంతో టీడీపీ, జనసేన వాయిదా కోరగా, ఎన్నికల అధికారి వారి ఒత్తిళ్లకు లొంగి వాయిదా వేశారు. దీంతో ఎన్నికల హాల్ లోనే వైయస్ఆర్సీపీ సభ్యులు బైఠాయించారు. యలమంచిలి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.  కైకలూరులో వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో భుజలపట్నం ఎంపీటీసీని టీడీపీ గుండాలు నిర్బంధించారు.  కోరం లేక పల్నాడు జిల్లా కారంపూడి వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.  కావలి నియోజవకర్గం దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నికకు 9 మంది ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు.

Back to Top