ఐటీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి

అనంత‌పురం పోలీసుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా ఫిర్యాదు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయ‌న‌ సతీమణి వై యస్ భారతి ప‌ట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన  ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా సలామ్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు అనంత‌పురం పోలీసుల‌కు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మహిళా విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఫిర్యాదు చేశారు.  కార్య‌క్ర‌మంలో సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనుప్రీత్ రెడ్డి ,  మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి , అధికార ప్రతినిధి కృష్ణవేణి ,  సోషల్ మీడియా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top