ఘ‌నంగా వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ ఆవిర్భావ వేడుక‌లు

అనంతపురం జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియ‌న్ ఆవిర్భావ వేడుక‌లు అనంత‌పురం జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ట్రేడ్‌ యూనియ‌న్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయ‌స్ఆర్‌ సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి  జెండాను ఆవిష్క‌రించారు.  పార్టీ శ్రేణులతో కలిసి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top