విశాఖపై పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోంది

జీఎన్‌రావు కమిటీ నివేదికను వక్రీకరిస్తున్నారు

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఉత్తరాంధ్ర, రాయలసీమకు చేసిందేమీ లేదు

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు అవసరం

ప్రజల మనోభావాల మేరకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉత్తమం అని కమిటీలు చెప్పాయి

టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరు
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

తాడేపల్లి: ఒక వర్గ ప్రజలకు మాత్రమే మేలు జరగాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడని, రియలెస్టేట్‌ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధాని ఉండాలని ఆందోళన చేయిస్తున్నాడని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెంది, రాష్ట్ర ప్రజలందరికీ ఫలాలు అందాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఏం చేశాడో చెప్పాలని, చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలబడ్డాడన్నారు. జీఎన్‌రావు, బోస్టన్‌ గ్రూపు నివేదికలపై పచ్చ పత్రికా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. జీఎన్‌రావు కమిటీ విశాఖను రాజధానిగా వద్దని చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు కమిటీల నివేదిక క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.
 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ పెట్టాలి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పచ్చ పత్రికలు, ఎల్లో మీడియా ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేస్తుంది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ గ్రూపు ఇచ్చిన నివేదికలను హైపర్‌ కమిటీ పరిశీలించింది. ఆ తరువాత హైపవర్‌ కమిటీ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న తరువాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎన్‌రావు కమిటీ నివేదికను వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్య వార్తలు ప్రచురిస్తున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కు ఉత్తమం అని జీఎన్‌రావు కమిటీ క్లియర్‌గా చెప్పింది. విశాఖ రాజధానికి అనువు కాదని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. నివేదికలో చాప్టర్‌ 6లో పరిపాలన రాజధానిగా విశాఖ ఉత్తమం అని జీఎన్‌రావు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు క్యాపిటల్స్, నాలుగు రీజియన్లుగా రాష్ట్రాన్ని విడగొట్టాలని జీఎన్‌రావు స్పష్టంగా చెప్పారు.

పచ్చ పత్రికలు, టీడీపీ నాయకులు విశాఖపట్నంలో తుపాన్లు వస్తాయి. అనువు కాదని మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన శాసనసభ సమావేశాల్లో ఇదే ప్రతిపక్షనేత చంద్రబాబు విశాఖపట్నం మంచి నగరం అని అనేక సందర్భాల్లో చెప్పారు. దేశానికి రెండవ రాజధానిగా విశాఖను పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే వ్యతిరేకించడం ఎంత వరకు సమంజసం. ముంబై, చెన్నై లాంటి నగరాలు కూడా సముద్రం పక్కనే ఉన్నాయి. అవి అభివృద్ధి చెందడం లేదా..? అంతెందుకు అమరావతిలో వరదలు రావా..? కర్నూలు, కడప, హైదరాబాద్‌లో వరదలు రావడం లేదా..? ఎల్లో మీడియా వార్తలు చాలా బాధాకరం.

టీడీపీ వికేంద్రీకరణకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు. అమరావతి మాకు ముద్దు.. వికేంద్రీకరణ మాకు వద్దు అని టీడీపీ వైఖరి. ఒక వర్గ ప్రజలకు మాత్రమే మేలు జరగాలని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అనేక సంవత్సరాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు న్యాయం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్టును వెలుగులోకి రానివ్వకుండా నారాయణ కమిటీ వేసి అమరావతిలో రాజధాని పెట్టారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు.

ప్రజల మనోభావాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎన్‌రావు నివేదికను భోగిమంటల్లో వేసి కాల్చుతామని చెప్పిన ఈ రోజు అదే జీఎన్‌రావు కమిటీ నివేదికలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అని ఎక్కడా చెప్పలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు బుద్ధి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ ఏ యూటర్న్‌ తీసుకుంటాడో తెలియని పరిస్థితి. వ్యవస్థలను మేనేజ్‌ చేసే ధీమాలో ఎప్పుడూ ఉంటారు. ఎమ్మెల్సీల మీటింగ్‌లో మండలి రద్దు అయితే భయపడాల్సిన అవసరం లేదు.. మీకు జీతాలు, ఖర్చులు భరిస్తానని చంద్రబాబు చెప్పాడు. అంటే ఎంతలా ఐదేళ్లు దోచుకున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాపం పండింది. చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమ మీద విషప్రచారం చేస్తున్నాడు. రాయలసీమ వాసి చంద్రబాబు కాదా..? 40 ఏళ్ల ఇండస్ట్రీ రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఏం చేశాడో చెప్పాలి. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలబడ్డాడు. సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితి. మండలిని ఎలా రద్దు చేస్తారు.. కేంద్రంలో అడ్డుకుంటాం అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. గతంలో ఎన్టీఆర్‌ ఎలా రద్దు చేస్తారో.. అదే ప్రక్రియ ద్వారా రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు.

 

Back to Top