విశాఖ: విశాఖపట్నం మెట్రో ప్రణాళికపై అధ్యయనం జరుగుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మెట్రో కారిడార్ అధికారులతో కలిసి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ పర్యటించారు. విశాఖలో మూడు కారిడార్లలో నిర్మాణం చేపట్టేందుకు గతంలో డీపీఆర్ సిద్ధమైన నేపథ్యంలో ఆ నివేదిక ప్రకారం కారిడార్లు నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించారు. మొదటి కారిడార్ గాజువాక – కొమ్మాది మార్గంలో పర్యటించారు. కూర్మన్నపాలెం, తాటిచెట్లపాలెంతో పాటు ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. Read Also: ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేశారు