జగనన్న ఆరోగ్య సురక్ష పేద‌ల‌కు వ‌రం

ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

నంద్యాల‌:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం పేద‌ల‌కు వ‌రం లాంటిద‌ని ఎథిక్స్ క‌మిటీ చైర్మ‌న్‌, శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి తెలిపారు. ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే సూచించారు. బుధ‌వారం నంద్యాల జిల్లా వెలుగోడు -1వ స‌చివాల‌యం ప‌రిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం వైద్య శిబిరాని పరిశీలించి, వైద్య సేవ‌ల గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చరిత్రాత్మక ఘట్టమన్నారు.  గ్రామాలకే స్పెషలిస్ట్ వైద్యులు తరలివచ్చి  వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం రాష్ట్రంలో మునుపేన్నడూ చూడలేదని చెప్పారు . వ్యాధిగ్రస్తులని గుర్తించి వారికి శిబిరాలలో గుండె సంబంధిత పరీక్షలు, బీపి, షుగర్, థైరాయిడ్, కంటి పరీక్షలు ఇతర జనరల్ చెక‌ప్‌లు చేసి వైద్య చికిత్స అందిస్తున్నార‌ని చెప్పారు. ఇంకా మెరుగైన వైద్యం అవసరమనుకుంటే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ కి రెఫర్ చేస్తున్నార‌ని తెలిపారు. వెలుగోడులో రూ.6.1 కోట్లతో నిర్మించిన సీహెచ్‌సీలో హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు రూ.40,000 ఇంజక్షన్ ఉచితంగానే ఇవ్వనున్నార‌ని, ఈ అవ‌కాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు.  ఈ ప్రభుత్వానికి మరొక్కసారి అవకాశమిచ్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంత‌రం నూత‌న పింఛ‌న్లు పంపిణీ చేశారు.  

Back to Top