కాసేపట్లో పాపిరెడ్డిపల్లికి వైయ‌స్‌ జగన్ 

హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ 

అనంత‌పురం: టీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ‌ శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గూండాలు వైయ‌స్ఆర్‌సీపీలో కీలకంగా వ్యవహరి స్తున్న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు. దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్ పరిశీలించారు.

పోలీసుల అత్యుత్సాహం
వైయ‌స్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను చూసేందుకు వ‌స్తున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను టీడీపీ నేతల డైరెక్షన్‌లో పోలీసులు అడ్డుకుంటున్నారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలో నిషేధాజ్ఞలు విధించి,  స్థానికులను కూడా అనుమతించ‌డం లేదు. దీంతో వాహనాలు వదిలి పొలాల వెంట న‌డుచుకుంటూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పాపిరెడ్డిపల్లికి వెళ్తున్నారు. ఎన్ఎస్ గేట్, రామగిరి వద్ద పోలీసులు వాహనాలు అడ్డుకోవ‌డం ప‌ట్ల సర్వత్రా విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Back to Top