చిత్తూరు: తెలుగు వారు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ నాడు కూడా.. నీచ రాజకీయాలు చేస్తూ.. మా మీద పడి ఏడుస్తున్నాడని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పండుగ పూట బాబు స్వగ్రామం నారావారిపల్లె వచ్చి, నన్నే గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు, మానిప్యులేషన్లనే నమ్ముకున్న చంద్రబాబుకు ఎప్పుడూ ఏడుపే తప్ప సంతోషం ఉండదన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ టీడీపీ జెండా పీకేయడం ఖాయం అని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. బాబుది ఎప్పుడూ ఏడుపు రాజకీయమే.. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఏకైక నాయకుడు కాబట్టి ఇంతకు ముందు ఆయనపై పడి ఏడ్చేవాడు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పైనా, ఆ తర్వత మంత్రి వర్గ సహచరులు పైన ఏడుస్తున్నాడు . ఆయన ఎడుపుకి కారణం చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ అయన మెజార్టీ సాధించలేకపోవడమే. మరోవైపు అధికారం పోయిందనే బాధ. - చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడా ఆ పార్టీ జెండా పీకేసెలా ప్రజలు ఉన్నారనే ఆయన బాధఅంతా. ఈ బాధలన్నీ గుర్తొచ్చి మాపై ఏడుస్తున్నాడు. ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిగారిని నోటికొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నాడు. - 2024 తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చంద్రబాబు అంటున్నారు. ఆయనకు అల్జీమర్స్ ఎక్కువ అవ్వడం వలన మధ్యలో 2019 సంగతి మర్చిపోయారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి గారు సిఎం అయ్యాక రాష్ట్రానికి మంచి రోజులు మొదలయ్యాయి. చంద్రబాబు పీడ రాష్ట్రానికి వదిలింది. ఇప్పుడు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారు. దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు బాబు ఏం చేశాడు..? - చంద్రబాబు చిత్తూరు జిల్లాకు ఏం చేశాడు అంటే చెప్పుకోవడానికి ఒక్క మేలు కూడా లేదు. ఈ జిల్లా వాసి కాకపోయినా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, బాధ్యతగల ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమంగా చూస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఆఖరికి కుప్పానికి కూడా ఎంతో చేశారు. కుప్పం మున్సిపాల్టీ అయితేనేమీ, రెవెన్యూ డివిజన్ చేయడం.. ఇవన్నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..?. చిత్తూరు జిల్లా అభివృద్ధి విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చి మేము అడిగినవన్నీ సీఎంగారు మంజూరు చేస్తున్నారు. చంద్రబాబు, చిత్తూరు జిల్లాకు ఎం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలి . - కుప్పానికి చంద్రబాబు ఏమైనా చేసుంటే ఈరోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక, 20 వేల ఇళ్లు పేదలకు ఎలా ఇచ్చేవారు? హంద్రీ- నీవా ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? - పుంగనూరులో కేసులు పెట్టమని మాట్లాడుతున్నారు. పుంగనూరు లో రౌడీయిజం చేస్తే లా అండ్ ఆర్డర్ పోలీసులు మెయింటైన్ చేయకూడదా ?. మీ రౌడీలు, గూండాలు గొడవలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా ? . మీ కార్యకర్తలు అరాచకాలు చేస్తే .. బాధితులు గాయపడి ఆసుపత్రుల్లో ఉన్నారు. మీ ఇష్టానికి వదిలేస్తే పోలీసులు, ప్రభుత్వం మంచిదా, లేకపోతే పుంగనూరులో అరాచకం చేస్తున్నామని మాపైన దుష్ప్రచారం చేస్తారా. ?. బాబుకు క్యారెక్టర్ లేదు చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు. కానీ, ఆయన మాత్రం మిగతా అందర్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడతాడు. టీడీపీ హయాంలో మా మీద అక్రమంగా కేసులు పెట్టి, ఎంపి శ్రీ మిథున్ రెడ్డి ని కూడా జైలు లో పెట్టారు, పుంగనూరు లో అభివృద్ధి అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు పట్టు లేదు, ఇక్కడ టిడిపి కి నాయకత్వం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా ఉన్నప్పటి నుండి చంద్రబాబు నాపై పై చెయ్యి సాధించలేకపోయాడు. జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాక.. టీడీపీ నామ రూపాలు లేకుండా పోయింది. ఇంకా ఏదైనా మిగిలుంటే, దాన్నికూడా వచ్చే ఎన్నికల్లో తుడిచేస్తాం. - మధ్యంతర ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారే మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు కూడా, ఈరోజు లాగే ఎడుస్తుంటావ్ చంద్రబాబూ.. చిత్తూరు జిల్లాకు బాబు భారం జిల్లాకు నువ్వు భారమా, నేను భారమా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం. ఈ జిల్లాలో పుట్టి.. ఈ జిల్లాకు ఏ ఒక్క మేలూ చేయని చంద్రబాబే ఈ జిల్లాకు భారం అవుతారు. ఈ జిల్లాలో పుట్టినందుకు నేను ప్రజల కోసం రుణం తీర్చుకునే పని చేస్తున్నా? మరి నీవు ఎందుకు చేయలేదు..? - చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టాడే కానీ, ఈ జిల్లాలో ఉండడు, ఈ జిల్లాకోసం ఏమీ చేయడు. అతను ఒక వలస పక్షి లా తిరుగుతుంటాడు. సొంత జిల్లా పై బాబుకు ఏ మాత్రం ప్రేమ లేదు. ఆఖరికి హత్య రాజకీయాలు కూడా మొదలు పెట్టింది చంద్రబాబే. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే జీవోను కాలుస్తారా..? - కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించింది ఎవరు? నువ్వు కాదా బాబూ ? పింగళి దశరధరామ్ ను ఎవరు చంపారు ? - గోదావరి పుష్కరాల్లో నీ షూటింగ్ కోసం 29 మందిని చంపావ్, మొన్న కందుకూరు లో 8 మందిని, గుంటూరు లో ముగ్గురిని చంపావ్ - ప్రజలను చంపి మళ్ళీ వారిపైనే రాజకీయాలు చేస్తున్నావ్. వాటన్నింటినీ చంద్రబాబు చేసిన హత్యలు గా పరిగణించాలి. - నీవు రోడ్ల మీద, ఇరుకు సందుల్లో సభలు పెట్టి జనాన్ని చంపుతుంటే... జీఓ నంబర్ 1 ను తీసుకొచ్చారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే జీఓ ను భోగిమంటల్లో కాలుస్తారా..?. అంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా.? - కాల్చాల్సింది జీఓ ను కాదు.. నీ బుద్ధిని, ముఖ్యమంత్రి అవ్వాలన్న నీ ఆరాటాన్ని. ముందు నిన్ను నువ్వు శిక్షించుకోవాలి. - కే. ఏ పాల్ కూడా ముఖ్యమంత్రి అవుతాను, ప్రధాని అవుతాను అంటున్నారు. ఆయనకి పార్టీ గుర్తు కూడా చంద్రబాబే ఇప్పించారు. అతనిలానే, చంద్రబాబుకు కూడా అల్జీమర్స్ ఎక్కువ అయిపోయి ఇలాంటి కలలు కంటున్నారు. - చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావు.