పొన్నూరు: పేదల కడుపు కొట్టేందుకు టీడీపీ, జనసేన కుట్రలు చేస్తున్నాయని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పొన్నూరులో నిర్వహించిన సామాజిక సాధికార సదస్సులో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌మాట్లాడారు. పెత్తందార్లకు ధీటుగా మా పిల్లలు చదువుకోవడం తప్పా..? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చెంచా నాదెండ్ల మనోహర్ ప్రెస్‌మీట్ పెట్టి విద్యా కానుక కిట్లు ఇవ్వడం తప్పంటున్నాడు. నాదెండ్ల మనోహర్‌కి చెప్తున్నా..మా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల పిల్లలు తలెత్తుకుని తిరుగుతుంటే ఓర్వలేరా మీరా? పెతందార్లకు ధీటుగా మా పిల్లలు చదువుకోవడం తప్పా..? మేమేం పాపం చేశాం? మా జగనన్న మా పిలల్లకు స్కూల్ బ్యాగ్, పుస్తకాలు ఇవ్వకూడదా? పేదలపై మీరు కక్ష కట్టారు..మీ పిల్లలైతే అమెరికాలో చదువుకో వచ్చా.. మా పిల్లలకు జగనన్న ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తుంటే మీకెందుకు కడుపుమంట..? మీరెంత మంది పొత్తులు పెట్టుకుని దొర్లాడుతూ వచ్చినా మేమంతా ఒక్కతాటిపైకి వచ్చి 175 స్థానాలను గెలిపించుకుంటాం. ఎవరడ్డు వచ్చినా, ఎంత మంది కలిసి వచ్చినా మా గెలుపును ఆపలేరు. సామాజిక సాధికార యాత్రపై ప్రతిపక్షాలు నోరుతెరవలేకపోతున్నాయ్: గత నెల 26 తేదీ నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరం ఏకతాటిపైకి వచ్చి చేస్తున్న ఈ యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. కేవలం జగనన్న కటౌట్ పెట్టి యాత్ర చేస్తేనే ఇంత స్పందన వచ్చింది. ఇక జగనన్న రంగంలోకి దిగితే ఇక వాళ్ల పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా? చంద్రబాబు జైలు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాడు.. ఆయన పిల్లాడు లోకేశ్ ఎటుపోయాడో తెలియదు.ఇక పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు... 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో మన జగనన్నలా సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే. మేం 26 నుంచి పర్యటన చేస్తుంటే...ప్రతిపక్షాలు ఒక్కరన్నా సామాజిక న్యాయం గురించి కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే వారిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. నలుగురు బీసీలను అత్యున్నత రాజ్యసభకు పంపిన నాయకుడు మా జగనన్న. స్పీకర్, మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానం ఎంపికలో సామాజిక న్యాయానికి ఆయన పెద్ద పీట వేశారు.