తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్ .. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.