ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైయ‌స్ఆర్‌సీపీ

అనంత‌పురం:   అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌ను నిర‌సిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఎంపీపీ ఉప ఎన్నిక‌ను బ‌హిష్క‌రించారు. అనంత‌పురం జిల్లా రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను వైయ‌స్ఆర్‌సీపీ బాయ్ కాట్ చేసింది. కూట‌మి నేత‌ల అరాచకాల‌ను అడ్డుకోవ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యారు.  బ‌హిరంగంగానే టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపుల‌కు దిగినా పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించారు. నిన్న పేరూరు ఎమ్పీటీసీ భారతిని ప‌రిటాల వ‌ర్గీయులు కిడ్నాప్ చేశారు.  గాండ్లపెంట ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాల‌కు దిగారు.  పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

Back to Top