ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌కే సాధ్యం

కూట‌మి నేత‌లు వైయ‌స్  జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే

మాజీ మంత్రి పేర్ని నాని

కృష్ణాజిల్లా:  ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని మాజీ మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి నేత‌లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైయ‌స్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సూచించారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క జగన్‌కే సాధ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు...ఆయన తొత్తు పవన్ కళ్యాణ్ ...  వైయ‌స్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఎ న్నికల ముందు సూపర్ సిక్స్ ..షణ్ముఖ వ్యూహం అని హామీలిచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు స్క్రిప్ట్ లు వేసుకుని బ్రతకాల్సిందే. ఐదేళ్ల క్రితం మన బ్రతుక్కి వచ్చింది 23 సీట్లు కాదా?, రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ధ్వజమెత్తారు పేర్ని నాని

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో వైస్‌ జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ఏమీ చేయలేదన్నారు. పోసాని కృష్ణమురళిపై ఏ ఆధారాలు లేకుండానే 18 కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని పేర్ని నాని మండిపడ్డారు.
 

Back to Top