ఉప ఎన్నిక వేళ‌.. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల గృహ నిర్బంధం

అనంత‌పురంలో జెడ్పీ చైర్మ‌న్ హౌస్ అరెస్ట్‌

ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు స‌హా ప‌లువురిని అడ్డుకున్న పోలీసులు

అనంత‌పురం జిల్లా:  వాయిదా ప‌డిన స్థానిక‌ ‘స్థానిక’ ఉప ఎన్నికల వేళ అధికార కూటమి ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకులు సృష్టిస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను గృహ నిర్బంధం చేసి అక్ర‌మాల‌కు తెర లేపింది. ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఆమెను ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.  అలాగే ప్రొద్దుటూరులో 
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా పలువురి నేతల హౌస్ అరెస్ట్ చేశారు.  నిన్న వాయిదా పడిన గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక నేడు నిర్వ‌హిస్తున్నారు. నిన్నటి ఎన్నికకు వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు హాజరుకాకుండా  ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక నేడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.  వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపడం లో పోలీసుల వైఫల్యం చెందారు.  

Back to Top