విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కార్మిక పక్షపాతి అని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు(YSRCP Trade Union formation celebrations) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని బి.ఆర్.టి.ఎస్ రోడ్ లో వైయస్ఆర్ టీయూసీ జెండాను గౌతమ్ రెడ్డి(Goutham Reddy) ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పునూరు గౌతమ్ రెడ్డి మాట్లాడారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి కోసం అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చారు. ఆటో, చేనేత, క్షౌ ర, పారిశుద్ధ్య కార్మికులతో అన్ని రంగాల కార్మికులకు అండగా నిలబడ్డారు. కార్మికుల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు మంచి చేశారు. కార్మికుల స్థితిగతులు బాగుపడాలన్న లక్ష్యంతోనే వైయస్ జగన్ చట్టాలను సక్రమంగా అమలు చేశారు. అనేక మందికి వృత్తి రీత్యా రాయితీ కల్పించి అండగా నిలిచారు. ఆప్కస్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి వైయస్ జగన్. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 1,30,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. నాలుగు లక్షల మందిని వాలంటీర్లను నియమించారు. కార్మికులకు వైయస్ జగన్ అండ: దేవినేని అవినాష్ గత ప్రభుత్వంలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా వైయస్ జగన్ అండగా నిలిచారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇచ్చి ఆదుకున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులను, కార్మికులను ఇబ్బంది పెట్టలేదు.కోవిడ్ సమయంలో కార్మికులకు జగన్ అండగా ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,బిజెపి నాయకులు కార్మికులు అభ్యున్నతను విస్మరించారు. కార్మిక చట్టాలను పరిరక్షిస్తూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వారికి మేలు చేస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతోంది.