నెల్లూరు: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు వరం లాంటిదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పేదలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పొదలకూరు మండలంలో రూ.2 కోట్ల 60 లక్షలతో చాటగొట్ల నుంచి బిరదవోలు వరకు పూర్తయిన రోడ్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.