సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మొదటి నుంచి పోరాటం చేసిన ఏకైక నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కన్నబాబు సభలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే2014 నుంచి ప్రత్యేక పోహదా కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు వైయస్ జగన్..గుంటూరులో నిరాహారదీక్ష చేశారు. ఢిల్లీలో ధర్నా చేశారు. ప్రతి జిల్లాలో యువభేరీలు నిర్వహించారు. ఆ రోజు అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రత్యేక హోదా అవసరం లేదని పోలవరం కాంట్రాక్ట్‌ల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారు. కేంద్రం నుంచి మంత్రులను తీసుకొచ్చి శాలువాలు కప్పి సన్మానం చేశారు. స్వీట్లు పంచుకున్న చరిత్ర టీడీపీది. వారు వచ్చి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యేక హోదా కావాలని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ ఒక్కరే. ఆ రోజు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని చెప్పింది వాస్తవం కాదా? ప‌్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారని, వైయస్ జగన్‌ను ఆదరిస్తున్నారని ఆ రోజు యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుంటారని చంద్రబాబు మైండ్ క్రియేట్ చేశారు. ఐదేళ్ల పాటు ఏమీ చేయకుండా స్వీట్లు పంచుకున్నారు. దండలేసుకొని ఊరేగింపులు చేశారు. విభజన చట్టంలోని అంశాల గురించి మాట్లాడారు. షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోతుంది. వారు 89 రెకమెండేషన్లు ఇస్తే..ఈ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపితే 68 రెకమొండేషన్లకు తెలంగాణ అంగీకరించింది. మేం సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ రోజు ఏం చేశారో తెలుసా..ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తరువాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చారు. ఇవాళ ప్రజలు ఎందుకు వారికి అలాంటి బహుమతి ఇచ్చారో తెలుసా..హైదరాబాద్ నుంచి పారిపోవడమే కారణం. చేసిందంతా చేసి ఇవాళ పిట్ట కథలు చెబుతున్నారు. టీడీపీకి ప్రత్యేక హోదా గురించి, విభజన చట్టం గురించి మాట్టాడే హక్కు లేదు. ఆ రోజు వైయస్ఆర్‌సీపీ ఎంపీలతో వైయస్ జగన్ రాజీనామాలు చేయిస్తే..మీరు రాజీనామా చేయలేదు. మోదీ అన్యాయం చేశారని ఎన్నికలకు ముందు మాట్లాడారు. ఎన్నికలు అయిపోయిన తరువాత 4 ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 68 రెకమేండేషన్లను చర్చిస్తోంది. షీలా బీడే కమిటీ సూచనలను ఈ ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఉమ్మడి రాజధానిలో ఆస్తులకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇచ్చిన బిల్డింగ్‌లో ఉన్న ఒక్క భవనాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం భవనాలు తీసుకుంటే ఏమీ మాట్లాడలేదు. సెక్రటరీయట్‌లో వృథాగా ఉన్న భవనాలను కూడా చంద్రబాబు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.ఈ ఐదేళ్లు కష్టపడితే తప్ప విభజన హామీలు సాధ్యం కావు. Read Also: ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు