విజయవాడ: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్ అభినవ అంబేడ్కర్, పూలే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి శంకర్‌నారాయణ మాట్లాడుతూ.. మహాత్మా రావు పూలే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, పేదలు, సమాజంలోని అణగారిన వర్గాలకు చదువుల చెప్పించాలని కృషిచేశారన్నారు. గత ప్రభుత్వాలు కేవలం రాయితీలు మాత్రమే ఇచ్చి పేదలను మభ్యపెట్టాయన్నారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బీసీ సామాజిక వర్గాలకు రాయితీలు ఒక్కటే కాదు.. రాజ్యాధికారం కూడా ఇస్తామని కార్యరూపం దాల్చిన వ్యక్తి అని వివరించారు. జ్యోతిరావు పూలే ఏ కార్యక్రమం కోసం పాటుపడ్డారో.. ఆ దిశగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని, పేదల బాగు కోసం ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారన్నారు. వైయస్‌ఆర్ ఆశయాల సాధన కోసం సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. కేబినెట్‌లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారని చెప్పారు. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి బీసీల అభివృద్ధి కోసం ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారన్నారు. Read Also: సీఎం వైయస్ జగన్ బీసీల ఆశాజ్యోతి