పార్టీలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్

 బాధిత కుటుంబాల‌కు చెక్కులు అంద‌జేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 

క‌ర్నూలు: అర్హ‌త ఉంటే చాలు పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ అంద‌జేస్తున్నామ‌ని ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి అన్నారు. సీఎం సహయనిధి క్రింద ఆరుగురుకి మంజూరైన  రూ. 12లక్షల చెక్కులను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బాధితులకు అందజేశారు. పత్తికొండ, తుగ్గలి, వెల్దుర్తి మండలాల లోని సీఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ  మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఆరోగ్యశ్రీ క్రింద లేనటువంటి చికిత్సలు అన్నిటికీ కూడా సీఎంఆర్ఎఫ్ క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే  తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ వివ‌రాలు ఇలా..

వడ్డే జగదీష్- 2,00,000/-

కురవ రామన్న -2,00,000/-

కురవ రామకృష్ణ - 2,00,000/-

మద్దికేర రమణ రెడ్డి - 2,00,000/-

చాకలి రాజు - 2,00,000/-

బోయ మేడికుండ ఆనందు - 2,00,000/-

 సీఎం సహాయనిధి అందించినందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి,  ఎమ్మెల్యే  శ్రీ‌దేవికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top