అమరావతి: జీరో అవర్‌లో టీడీపీ సభ్యులు సీట్ల విషయంలో ఆందోళన చేపట్టడం పట్ల అధికార పక్ష సభ్యులు తప్పు పట్టారు. ప్రతిపక్ష నేత కొత్త సంప్రదాయాలు నేర్పుతున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మీరు చెప్పినట్లు సభను నడపాలా అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్నిప్రశ్నించే అధికారం ఎవరికి లేదని చెప్పారు. ప్రతిపక్షం ముందు నిబంధనలు తెలుసుకోవాలి: మంత్రి బుగ్గన ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ముందుగా అసెంబ్లీ నిబంధనలు తెలుసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తుంది: అంబటి ప్రతిపక్ష టీడీపీ సభ్యులు బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు.