కార్మికులంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే

వైయస్‌ఆర్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు గౌతమ్‌రెడ్డి
 

తాడేపల్లి: కార్మికులంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై అన్నివర్గాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌతమ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వైయస్‌ జగన్‌ చలిపోయారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ. 24 వేలు, ఇండస్ట్రీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకురావడం, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థికసాయం చేశారన్నారు. వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ తరుఫున రాష్ట్రమంతా కార్మికుల పక్షపాతిగా ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కళ్లబొల్లి మాటలు చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనను చూసి నేర్చుకోవాలని సూచించారు. కార్మికులందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అండగా ఉన్నారన్నారు.

Read Also: అవాస్తవాలు ప్రచారం చేస్తే ఉపేక్షించం

 

Back to Top