నేడు ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో ఆయన చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 22వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుని, సాయిప్రియా రిసార్ట్స్‌లో అరకు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అదేరోజు రాత్రి తాడేపల్లి చేరుకుంటారు. 

Read Also: ఏపీలో జిల్లాలకు కొత్త ఇన్‌చార్జ్ మంత్రులు

Back to Top