కేజీ ఉల్లి రూ.25 అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఉల్లిపాయల అంశంపై చర్చకు మేం రెడీ

అసెంబ్లీ: దేశవ్యాప్తంగా కేజీ ఉల్లి రూ.25 అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మహిళా భద్రతపై సోమవారం జరుగుతున్న చర్చకు టీడీపీ సభ్యులు అడ్డుపడటంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముఖ్యమైన మహిళా భద్రతపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ..రాష్ట్రంలోని మహిళల భద్రత గురించి మాట్లాడుతుంటే వీళ్లు..ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగడం లేదు. దేశం మొత్తం మీద ఒక్క ఏపీలో మాత్రమే ఉల్లిపాయలు కేజీ రూ.25 చొప్పున అమ్ముతున్నాం. ప్రతి రైతు బజారులోనూ కేజీ రూ.25 చొప్పున అమ్ముతున్నారు. ఇంతవరకు 36536 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో అమ్ముతున్నాం. మన రాష్ట్రంలో దొరకడం లేదని సోలాపూర్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి చూశాం. ఈ రోజు రైతులకు మంచి రేటు దొరకుతుంది. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే ఉల్లిపాయలు అమ్ముతున్నాం. చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి రూ.200 చొప్పున అమ్ముతున్నారు. వీళ్లు ఇక్కడికి వచ్చి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. నిజంగా న్యాయం, ధర్మం ఉందా అధ్యక్షా? రాష్ట్రంలో నిజంగా మహిళల భద్రత గురించి చర్చ  జరగాలి. రాష్ట్రంలో ఎంత దిగజారిపోయిన పరిస్థితి ఉంది. కొత్త చట్టాలు తీసుకురావాలి. ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయో చర్చ జరగాలి. ఒక మంచి చట్టం తీసుకువచ్చే కార్యక్రమం ఇదే అసెంబ్లీ సమావేశాల్లో చేయబోతున్నాం. చర్చ జరిగేందుకు సహకరించాలని కోరుతున్నాం అధ్యక్షా..

Read Also: భాషా పండిట్‌ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు

Back to Top