జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలోని అంటరాని తనాన్ని, అందరికీ విద్యను అందించాలని నిరంతరం కష్టపడ్డారని పశుసంవర్ధక, మత్స్య శాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిరంతరం కృషిచేస్తున్నారని చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. పేదరికం విద్యకు అడ్డుకాకూడదని పేదవాడికి నాణ్యమైన విద్య అందించాలని సంపూర్ణ ప్రక్షాళన చేస్తున్నారన్నారు. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను కూడా తీసుకువస్తున్నారన్నారు. మహిళలకు నామినేటెడ్‌ పనుల్లో, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈ తరం సీఎం వైయస్‌ జగన్‌ మరో పూలేగా గుర్తింపు తెచ్చుకుంటున్నారన్నారు. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ అభినవ పూలే

 

Back to Top