అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టీడీపీ నేతలు పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. మతం మార్చటానికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నారని వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. 'కిరసనాయిలు మాటలు, రాతలు చూస్తుంటే ఆయనకు ఆరు నెలలుగా నిద్ర పడుతున్నట్టు లేదు. చంద్రబాబు నాయుడి పతనంతోనే అక్రమార్జన నిలిచి పోయింది. అసూయ, కడుపుమంట, మానసిక క్షోభతో మైండ్ కంట్రోల్ తప్పినట్టుంది. ఇంగ్లిష్ మీడియం మతం మార్చటానికట! పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరు' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. Read Also: వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ