విజయవాడ: విధి నిర్వాహణలో అసువులు బాపిన పోలీసు అమరవీరులకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు అయ్యారు. పోలీస్ త్యాగధనులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల సేవలను సీఎం కొనియాడారు. Read Also: నేడు ఢిల్లీకి సీఎం వైయస్ జగన్