సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వేద‌పండితుల ఆశీర్వ‌చ‌నం

తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్‌కు వేద‌పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అంద‌జేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం నిర్వ‌హించారు. 

Back to Top