వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం

చంద్రబాబు ఆర్ధిక విధానాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన

అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు అంటూ ట్వీట్

తాడేపల్లి : దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యంగ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతూ రాష్ట్ర భ‌విష్య‌త్తు అంధ‌కారమ‌యం చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆర్థిక విధానాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుల కోసం 436 గనులను ఏపీ ఎండీసీకి అప్పగించ‌డం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌లు అంటూ ఎక్స్‌ వేదికగా కూట‌మి ప్ర‌భుత్వ విధానాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎండ‌గ‌ట్టింది.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ఆర్‌సీపీ ... 

‘వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు. 436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి. రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు. భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం. రుణాలిచ్చే సంస్థలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాయిదాలు తీసుకునే అవకాశం. రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అంటూ’  పేర్కొంది. 

Back to Top