మంగళగిరి: ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నారని వైయస్ఆర్సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏదైనా ప్రభుత్వానికి 60 నెలలు పాలించాలని ప్రజలు ఎన్నుకుంటారని, కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికేయాలని అనుకుంటున్నారని, ఇక్కడ గొంతు పట్టుకుంటున్నది నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతల, విద్యార్థుల గొంతును నొక్కుతున్నారని వీరు మరచిపోతున్నారన్నారు.